జెడ్ పి హెచ్ ఎస్ పర్వతగిరి పాఠశాలలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు..

జన చరిత్ర న్యూస్ పర్వతగిరి పర్వతగిరిమండల కేంద్రం లోని జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఉట్టి కొట్టుడు కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు విద్యార్థులు సంతోషంగా నిర్వహించారు. చివరిగా పదవ తరగతి విద్యార్థి పి.కళ్యాణ్ ఉట్టి కొట్టి తన చాతుర్యాన్ని శక్తిని చాటి చెప్పాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కందుకూరి నవీన్ కుమార్ గారు మాట్లాడుతూ సంస్కృతీ సాంప్రదాయాలను ప్రతిబింబించే ఇలాంటి పండుగలు ప్రజల్లో సంతోషాన్ని శాంతిని నీతిని బోధిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు