కుడా చైర్‌పర్సన్‌గా నియమించిన సీఎం రేవంత్ రెడ్డికి గుండు సుధారాణి కృతజ్ఞతలు
బీసీ మహిళలకు అత్యున్నత పదవులు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయం వరంగల్, సెప్టెంబర్ 3: తనను కుడా చైర్‌పర్సన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి గుండు సుధారాణి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. బీసీల పక్షపాతిగా, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు బీసీ మహిళలకు అత్యంత కీలకమైన, ప్రధానమైన పదవులు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని ఆమె పేర్కొన్నారు. బీసీ మహిళలకు ఇంతటి ప్రాధాన్యత కలిగిన పదవులు అందించడం కేవలం పదవుల కల్పన మాత్రమే కాదని, బీసీ వర్గాలపై ముఖ్యమంత్రి గారికి ఉన్న నమ్మకానికి, మహిళల సామర్థ్యంపై ఆయనకున్న విశ్వాసానికి నిదర్శనమని...