జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన: బిఆర్ఎస్ పార్లమెంటరి పార్టీ ఫ్లోర్ లీడర్:ఎంపీ రవిచంద్ర
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర గురువులందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.సుప్రసిద్ధ విద్యావేత్త,భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు సందర్భంగా 1962వ సంవత్సరం నుంచి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఎంపీ రవిచంద్ర తన సందేశంలో పేర్కొన్నారు.గొప్ప తత్వవేత్తగా పేరొందిన రాధాకృష్ణన్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసిన మొట్టమొదటి భారతీయుడని,ఆంధ్రా,బనారస్ హిందూ విశ్వవిద్యాలయాల ఉప కులపతిగా పని చేశారన్నారు.సోవియట్ రష్యాలో భారత రాయబారిగా,ఉప రాష్ట్రపతిగా,రాష్ట్రపతిగా, విద్యావేత్తగా దేశానికి ఆయన అందించిన విశేష సేవలకు గాను ప్రభుత్వం నుంచి భారతరత్న పురస్కారాన్ని అందుకున్న రాధాకృష్ణన్ తెలుగు వాడు కావడం మనందరికి గర్వకారణం...