మోత్కూరులో కృష్ణాష్టమి వేడుకలు
సెప్టెంబర్ 4 (జన చరిత్ర): మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని ఓ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు శ్రీకృష్ణుని గోపికల వేషధారణలో అలరించారు. చిన్నారులు ఉట్టి కొట్టి సంబరాలు జరుపుకున్నారు. చిన్నారుల సందడితో పాఠశాలలో పండగ వాతావరణం నెలకొంది. దీంతో పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.