మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి
ప్రజా పాలనలో వెయ్యి రోజుల ప్రగతిని వివరిస్తూ.. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ.. రేపు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహా ధర్నా! మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 6న ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించనున్న మహా ధర్నాను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునివ్వడం జరిగింది. వెయ్యి రోజులుగా ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటూ అసెంబ్లీకి హాజరు కాకుండా, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా, ప్రతిపక్ష పాత్రను నిర్వర్తించకపోవడంపై కేసీఆర్‌ను ప్రశ్నించడం జరిగింది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి తన బాధ్యతలను నిర్వర్తించనప్పుడు ఎమ్మెల్యే పదవిలో కొనసాగడం ఎందుకని ప్రశ్నించడం జరిగింది. కాంగ్రెస్...