నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన గుండు సుధారాణిని మర్యాదపూర్వకంగా కలిసిన విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు

ప్రమాణస్వీకారం చేసిన గుండు సుధారాణిని విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు గజ్జల భగవాన్, శ్రీరామోజు నాగేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. నూతన బాధ్యతల్లో గుండు సుధారాణి విజయవంతంగా రాణించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.