వక్ఫ్ భూమిలో అక్రమ నిర్మాణాలు..చర్యలు ఎప్పుడో?

*కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన దర్గా కమిటీ..అధికారుల తీరుపై అసంతృప్తి* *తెలంగాణ/వరంగల్,సెప్టెంబర్ 5* ఖిలా వరంగల్ మండలం ఉరుస్ జాగీర్ గ్రామ పరిధిలోని హజ్రత్ జిందా బిక్కన్ దర్వేష్ దర్గా,మసీదుకు చెందిన వక్ఫ్ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తూ దర్గా కమిటీ సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు.ఇప్పటికే పలుమార్లు సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు కనిపించకపోవడంతో తాజాగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు.కమిటీ వివరాల ప్రకారం..సర్వే నంబర్లు 273,274,275,276లోని నోటిఫైడ్ వక్ఫ్ భూమిలో వక్ఫ్ బోర్డు నుంచి ఎలాంటి చట్టబద్ధ అనుమతులు,లిఖితపూర్వక సమ్మతి,చెల్లుబాటు అయ్యే లీజు ఒప్పందం లేదా ఎన్‌ఓసీ లేకుండానే ఇళ్లు,షెడ్లు,వాణిజ్య నిర్మాణాలు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు.భారీ...