సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలు చిరస్మరణీయం
వరంగల్ జిల్లా: భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా, ముఖ్యంగా విద్యాసంస్థల్లో గురుపూజోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారని ప్రైవేట్ టీచర్స్ యూనియన్ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి సింగనబోయిన శ్రీశైలం తెలిపారు, ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు, ఉపాధ్యాయుల సేవలను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించడం ఆయనకు ఇచ్చే గౌరవానికి ప్రతీక అని అన్నారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి అందించిన సేవలు, విద్యారంగ అభివృద్ధికి చేసిన కృషి చిరస్మరణీయమని శ్రీశైలం పేర్కొన్నారు, తత్వశాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, రాజనీతిజ్ఞుడిగా ఆయన భారతదేశ ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లారని...