నిరుపేద విద్యార్థినికి MBBS సీటు : ఆర్థిక కారణాలతో దాతల సాయం కోసం ఎదురుచూపు!
చౌటుప్పల్: తంగడపల్లి గ్రామానికి చెందిన ఉబ్బు నర్మద నీట్ అర్హత పరీక్ష ద్వారా ఎంబీబీఎస్ సీటు సాధించింది. కానీ తండ్రి మరణం, తల్లి అనారోగ్యం,ఒకవైపు ఆర్థిక కారణాలతో కుటుంబ పోషణ, ముగ్గురు ఆడ పిల్లల చదువు ఇలా ఎన్నో సమస్యలతో, ఆ కుటుంబం పుట్టెడు కష్టాల్లో ఉంది.మా అమ్మ ఆరోగ్యం సహకరించక పోయినా,విధి లేని పరిస్థితుల్లో కూలీ పనితో కుటుంబాన్ని పోషిస్తూ, ముగ్గురు అక్కా చెల్లెల్లను చదివిస్తుందని, కానీ ఎంబిబిఎస్ చదివించేంత స్తోమత తన తల్లికి లేదని, కానీ డాక్టర్ కావాలనే ఆశ ఉందని విద్యార్థిని కన్నీటి పర్యంతమయ్యారు. నీట్ శిక్షణ నిమిత్తం అపోలో మెడికల్ అకాడమీ యాజమాన్యాన్ని సంప్రదించగా డైరెక్టర్ పొసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్...