టీచర్స్ డే సందర్భంగా 11 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

వరంగల్: టీచర్స్ డే సందర్భంగా వరంగల్ జిల్లాలో అంకితభావం, నిబద్ధత, సేవా తత్పరతతో పనిచేస్తున్న వివిధ పాఠశాలలకు చెందిన 11 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు. హంటర్ రోడ్‌లోని PRR కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం ఉదయం రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమం ఎంతో ఘనంగా, విజయవంతంగా జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ అధ్యక్షులు సోమ వేణు ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి, ప్రశంసాపత్రాలతో ఘనంగా అభినందించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విశేష సేవలు అందిస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని కార్యక్రమంలో పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో...