సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ..
123 మంది లబ్ధిదారులకు రూ.32.40 లక్షల సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయిని.. హనుమకొండ: పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన 123 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.32,40,000/- విలువైన సీఎం సహాయనిధి చెక్కులను బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. అనారోగ్యంతో చికిత్స పొందిన కుటుంబాలకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పేద కుటుంబాలకు వైద్య...