వినూత్న ఉత్పత్తులతో స్వయం ఉపాధికి అవకాశాలు

*యువత ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి* *హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి* *హనుమకొండ గోపాల్ పూర్ లో అరిస్సా గ్రోత్ ఫార్మ్స్ మిల్లెట్ పన్నీరు మాన్యూప్యాక్చరింగ్ ప్రాసెసింగ్ యూనిట్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్* మిల్లెట్ ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంతోపాటు స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని *జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి* అన్నారు. ఆదివారం హనుమకొండ గోపాల్ పూర్ జవహర్ కాలనీలో ఐఐఎంఆర్ న్యూట్రి హబ్ ప్రోత్సాహంతో ఉజ్వల చంద్రగిరి అనే యువతి ఎంటర్ప్రెన్యూషిప్ లో భాగంగా నెలకొల్పిన అరిస్సా గ్రోత్ ఫార్మ్స్ మిల్లెట్ పన్నీరు మాన్యూప్యాక్చరింగ్ ప్రాసెసింగ్ యూనిట్ ను జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు....