నిజాయితీ, నిష్పక్షపాత వార్తలతో ప్రజల పక్షాన నిలవాలి: ఈగ మల్లేశం
వరంగల్ పట్టణంలోని లేబర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన M1 TV చానల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి M1 TV కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ శ్రీ ఈగ మల్లేశం 👉ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... నిజాయితీ, నిష్పక్షపాత వార్తలతో ప్రజల పక్షాన నిలవాలని, సమాజంలో మీడియా పాత్ర అత్యంత కీలకమైనదని అన్నారు. ప్రజా సమస్యలను వెలికితీస్తూ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య నిరంతరం ఒక బలమైన వారధిగా నిలవడమే నిజమైన జర్నలిజం అని ఆయన అన్నారు. ఇప్పుడు ఈ సరికొత్త సాంకేతికతను జోడించుకుంటూ, నిజాయితీ గల వార్తలతో, నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన...