ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు పఠానీ సూట్లు
*పేద విద్యార్థులకు 60 పఠానీ సూట్లు పంపిణీ* ముస్లిం వెల్ఫేర్ సొసైటీ వరంగల్ ఆధ్వర్యంలో పేద,నిరుపేద విద్యార్థులకు పఠానీ సూట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.పెన్షన్‌పురాలోని మదర్సా మదీనతుల్ ఉలూమ్‌కు చెందిన 35 మంది పేద విద్యార్థులకు,మండి బజార్‌లోని మదర్సా అరబియా ఖైరుల్ ఉలూమ్‌కు చెందిన 25 మంది అర్హులైన విద్యార్థులకు పఠానీ సూట్లును పంపిణీ చేశారు.పేద,అర్హులైన విద్యార్థులకు అండగా నిలిచే కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని సొసైటీ ప్రతినిధులు తెలిపారు.వరంగల్‌లోని మరో 12 అరబిక్ మదర్సాలకు చెందిన పేద విద్యార్థులకు కుర్తా,పైజామాలు పంపిణీ చేసేందుకు ప్రతిపాదించినట్లు వెల్లడించారు.కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ సొసైటీ వరంగల్ అధ్యక్షుడు మహమ్మద్ సిరాజ్ అహ్మద్,కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్ కలీం,ఎగ్జిక్యూటివ్ సభ్యుడు మిర్జా ఫతా...