వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలి

రౌడీషీటర్లకు మిల్స్‌ కాలనీ ఇన్‌స్పెక్టర్‌ మంగీలాల్‌ హెచ్చరిక వరంగల్: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని మిల్స్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మిల్స్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ మంగీలాల్‌ రౌడీషీటర్లను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్‌ మంగీలాల్‌ మాట్లాడుతూ వినాయక చవితి పండుగను ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరుపుకునేలా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సూచించారు. పండుగ సందర్భంగా గణేష్‌ మండపాల ఏర్పాటు, ప్రత్యేక పూజలు, ఊరేగింపులు, నిమజ్జనం కార్యక్రమాల సమయంలో ఎలాంటి గొడవలు, అల్లర్లు లేదా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని...