తెల్లదొరలను గడగడలాడించిన ‘తెలుగు వీరనారీమణులు

భారత స్వాతంత్య్ర సంగ్రామం… రక్తంతో లిఖించిన యోధుల చరిత్ర! ఈ చరిత్ర పుటల్లో పురుషుల పౌరుషంతో పాటు, తమ మాతృభూమి స్వేచ్ఛ కోసం ప్రాణాలనైనా అర్పించడానికి సిద్ధపడిన వీరనారీమణుల త్యాగాలు కూడా అంతే ఉజ్జ్వలంగా వెలిగాయి. ముఖ్యంగా తెలుగు నేల సృష్టించిన ఆ వీరవనితల వీరత్వం బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను పెకిలించి వేసింది. అనేక రకాల కట్టుబాట్లు ఉన్నప్పటికీ వాటికి ఎదురీది పోరాడారు తెలుగు వీరనారీమణులు! పసిపాపలను చంకన పెట్టుకుని జైలు గోడలను ముద్దాడారు! తెల్లదొరల తుపాకీ తూటాలకు గుండెలను ఎదురొడ్డి ‘వందేమాతరం’ అని గర్జించారు. మహాత్మా గాంధీ పిలుపుతో దేశమంతటా స్వాతంత్య్ర కాంక్ష రగులుతున్న తరుణమది. ఆంధ్రదేశంలో ఆ ఉద్యమ శంఖారావాన్ని పూరించిన తొలి...