బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రాకుండా ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసన

హనుమకొండ: బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రాకుండా ప్రభుత్వం వ్యవహరించిన తీరును నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు హనుమకొండ చౌరస్తాలో మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తూ రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ వైఖరికి నిరసనగా దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తరఫున తమ వాణిని వినిపించాల్సిన ప్రజాప్రతినిధులను అసెంబ్లీకి రాకుండా అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలను చర్చించి, వాటికి పరిష్కార మార్గాలను సూచించే ప్రజాస్వామ్య...