రోజా క్రియేషన్స్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ‘బృందావనమాలి’
మన సంస్కృతి, సంప్రదాయాలు, కళలను పరిరక్షిస్తూ భావితరాలకు అందించాలనే సంకల్పంతో గత 30 సంవత్సరాలుగా కళాసేవ, సమాజసేవలో అలుపెరుగని ప్రయాణం సాగిస్తున్న రోజా క్రియేషన్స్, వరంగల్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ‘బృందావనమాలి’ పేరిట ఆదివారం పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కమ్యూనిటీ హాల్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి. రోజా క్రియేషన్స్ అధినేత, కార్యక్రమ దర్శకులు ఆలేటి శ్యామ్ సుందర్ సారథ్యంలో జరిగిన ఈ వేడుకలు భక్తి, సంగీతం, నృత్యం, కళల అపూర్వ సమ్మేళనంగా సాగాయి. మూడు దశాబ్దాలుగా కళాకారులను ప్రోత్సహిస్తూ, ప్రతిభకు వేదిక కల్పిస్తూ, మరుగున పడుతున్న కళారూపాలకు జీవం పోస్తూ రోజా క్రియేషన్స్ వరంగల్ సాంస్కృతిక రంగంలో తనదైన ముద్రతో ముందుకు సాగుతోంది. ఈ వేడుకల్లో...