రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం… చిప్ప వెంకటేశ్వర్లు నేత కుట్టుశిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ

కొత్తవాడలో చిప్ప వెంకటేశ్వర్లు నేత ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ సౌజన్యంతో నిర్వహిస్తున్న కుట్టుశిక్షణ కార్యక్రమంలో మూడో బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ Rtn అధ్యక్షుడు సోమ వేణుగోపాల్, ప్రాజెక్ట్ చైర్మన్ Rtn pp బేతి అశోక్ బాబు, టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు, నేత రాగవులు ముఖ్య అతిథులుగా హాజరై మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. మహిళలకు కుట్టుశిక్షణ అందించడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, వారు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ఇది దోహదపడుతుందని వారు తెలిపారు. కార్యక్రమ...