స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై తాటా మధు వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం
*ప్రజాస్వామ్య వ్యవస్థను, స్పీకర్ పదవిని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు...* *యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కందికట్ల అనిల్ తీవ్ర ఆగ్రహం* జన చరిత్ర న్యూస్ పర్వతగిరి పర్వతగిరి మండల కేంద్రంలో సోమవారం రోజున విలేకరుల సమావేశంలోతెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాటా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కందికట్ల అనిల్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కందికట్ల అనిల్ మాట్లాడుతూ... ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే శాసనసభ స్పీకర్ పదవిని కించపరిచే విధంగా మాట్లాడటం తాటా మధు రాజకీయ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం...