ఆటపాటలతో సామాజిక చైతన్యం

తెలంగాణ వరంగల్ సెప్టెంబర్ 7* హసన్‌పర్తి: ప్రజల్లో సామాజిక చైతన్యం పెంపొందించడంతోపాటు నేరాలపై అవగాహన కల్పించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నాగారం గ్రామంలో ‘పోలీస్ జాగృతి కళాబృందం’ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.హసన్‌పర్తి ఇన్‌స్పెక్టర్ ఎ.మహేందర్,ఎస్‌ఐ రవి,గ్రామ పోలీసు అధికారి వై.ప్రకాశ్‌తోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.కళాబృందం సభ్యులు ఆటపాటలు,సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా సైబర్ నేరాలు,ఆన్‌లైన్ మోసాలు, మహిళల భద్రత,షీ టీమ్స్ సేవలు,అత్యవసర సమయంలో డయల్‌ 100/112 వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు.మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు,వేధింపులు,రోడ్డు భద్రతా నిబంధనలు,మూఢనమ్మకాల నిర్మూలన తదితర అంశాలను వివరించారు.ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మహేందర్ మాట్లాడుతూ సాంకేతికత విస్తరిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా యువత,మహిళలు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.గ్రామాల్లో...