స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు దుర్మార్గం: కాంగ్రెస్ శ్రేణుల తీవ్ర ఆగ్రహం

వరంగల్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారిపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. ఈ వ్యాఖ్యలకు నిరసనగా నేడు హాసన్పర్తి మండల కేంద్రంలో మండల అధ్యక్షులు రేణిగుంట్ల అశోక్, డివిజన్ అధ్యక్షులు నేదునూరి సునీల్, పుట్ట తిరుపతి ఆధ్వర్యంలో భారీ ధర్నా, దిష్టి బొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనలో హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇనగాల మాట్లాడుతూ.. అత్యున్నతమైన స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తిపై బాధ్యతారహితంగా, అవమానకరంగా మాట్లాడటం బీఆర్ఎస్ పార్టీ అహంకారానికి నిదర్శనమని...