కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్ఎస్ నిరసన

వరంగల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలుపై బీఆర్ఎస్ నిరసన చేపట్టింది.ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాశీబుగ్గ చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు పూలమాల వేసి వినతిపత్రం సమర్పించారు. వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి, వెయ్యి రోజులు పూర్తయినా హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు.అసెంబ్లీ ప్రాంగణంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై...