కొడవటూరు గ్రామంలో కుర్మకులస్తుల మధ్య గొర్రెలు, మేకల షెడ్ల వివాదంపై ముందస్తు చర్యలు

కొడవటూరు గ్రామంలో కుర్మకులస్తులకు చెందిన రెండు వర్గాల మధ్య ఇప్పటికే ఏర్పాటు చేసి ఉన్న గొర్రెలు, మేకల షెడ్ల విషయమై గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోంది. ఇరువర్గాల మధ్య ఈ వివాదం సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే పరిస్థితులు కనిపించకపోవడంతో, భవిష్యత్తులో ఇరువర్గాల మధ్య గొడవలు జరిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బచ్చన్నపేట పోలీసులు ఇరువర్గాలకు చెందిన మొత్తం 87 మందిని స్థానిక ఎంఆర్ఓ గారి సమక్షంలో బైండోవర్ చేయడం జరిగింది. బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఇరువర్గాలను పోలీసులు హెచ్చరించారు....