బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్–2026’ పోస్టర్‌ను ఆవిష్కరించిన రాష్ట్ర రోడ్లు, భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్–2026’ పోస్టర్‌ను ఆవిష్కరించిన రాష్ట్ర రోడ్లు, భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడంతో పాటు, యువతలోని సృజనాత్మక ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో ఈ ఛాలెంజ్‌ను నిర్వహిస్తున్నారు.షార్ట్‌ఫిలింలు, పాటలు, వీడియోల ద్వారా యువ ఫిలిం మేకర్స్, విద్యార్థులు, ఔత్సాహిక కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ కార్యక్రమం గొప్ప వేదికగా నిలుస్తుందని మంత్రి తెలిపారు.బతుకమ్మ విశిష్టత, తెలంగాణ సంస్కృతి, జానపద కళలు, సంప్రదాయాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సృజనాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ ఛాలెంజ్ దోహదపడుతుందని పేర్కొన్నారు. యువ...