ఘనంగా చల్లా జన్మదిన వేడుకలు" బీఆర్ఎస్‌ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు

గీసుకొండ: పరకాల నియోజకవర్గ అభివృద్ధికి చల్లా ధర్మారెడ్డి విశేషంగా కృషి చేశారని బీఆర్ఎస్‌ నాయకులు అన్నారు. గత పదేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గానికి రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేసిన నాయకుడిగా చల్లా ధర్మారెడ్డికి ప్రజల్లో మంచి ఆదరణ ఉందన్నారు. మండలంలోని పీడీఆర్‌ ఫంక్షన్‌ హాల్లో మండల బీఆర్ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, రహదారులు, తాగునీరు, సాగునీటికి ప్రాధాన్యం ఇచ్చారని నాయకులు తెలిపారు....