జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ను సన్మానించిన మాజీ కార్పొరేటర్ మరుపళ్ళ రవి

అండర్ రైల్వే గేటు ప్రాంతంలోని కరీమాబాద్ లో గల న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కోడం సబిత కు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించడం ఆనందదాయకమని 40 డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి అభిప్రాయపడ్డారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ అభినందన కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ కోడం శ్రీధర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మరుపల్ల రవి అవార్డు గ్రహీతను శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు . ఈసందర్భంగా కరస్పాండెంట్ శ్రీధర్ మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ పాఠశాల ఉన్నతికి పాటుపడి ఎందరో విద్యార్థినీ విద్యార్థులకు మార్గదర్శకురాలిగా నిలిచిన ప్రధానోపాధ్యాయురాలు కోడం సబిత...