శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ దుర్మార్గం: మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

తెలంగాణ శాసనసభ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సహా 17 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల మొత్తం సెషన్ కాలానికి సస్పెండ్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై సభలో గళం విప్పకుండా, ప్రతిపక్షాల నోరు నొక్కేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధమైన అప్రజాస్వామిక నిర్ణయానికి ఒడిగట్టిందని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ... ప్రజాస్వామ్యానికి దేవాలయాల వంటి శాసనసభల్లో ప్రజాప్రతినిధులకు మాట్లాడే హక్కును కాలరాయడం దారుణమన్నారు. కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, కౌశిక్...