శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు – రౌడీ షీటర్లకు నల్గొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి హెచ్చరిక..

నల్గొండ: నల్గొండ పట్టణంతో పాటు సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారని నల్గొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి తెలిపారు. రాబోయే వినాయక నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో నల్గొండ సబ్ డివిజన్ పరిధిలోని రౌడీ షీటర్లకు బుధవారం సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్గొండ టౌన్ పరిధిలోని 75 మంది రౌడీ షీటర్లతో పాటు సబ్ డివిజన్ పరిధిలోని మొత్తం 150 మంది రౌడీ షీటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, గతంలో నేరాలకు పాల్పడిన వారు తమ నేర ప్రవృత్తిని పూర్తిగా విడిచిపెట్టి, ఇకపై ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా...