తెలంగాణ విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ వరంగల్ హనుమకొండ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు ఎన్నిక
వరంగల్ నగరంలోని భద్రకాళి రోడ్డు నందుగల శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కళ్యాణ మండపం నందు తెలంగాణ విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ వరంగల్ మరియు హనుమకొండ జిల్లాల కమిటీ ఎన్నికలు ఉమ్మడి వరంగల్ జిల్లాల నుండి హాజరైన విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ సభ్యుల సమక్షంలో నిర్వహించడం జరిగినది. ఎన్నికల్లో వరంగల్ జిల్లా నుండి కుంటమల్ల అరవింద్ అధ్యక్షునిగా, మునిగంటి అమరేంద్ర చారి ప్రధాన కార్యదర్శిగా, అలాగే హనుమకొండ జిల్లా నుండి ఉల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షుడుగా దించనాల రాజు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ తుములూరి సత్యనారాయణ , ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శి డాక్టర్ పొడిశెట్టి విష్ణువర్ధన్ నూతన కార్యవర్గం...