ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం..వ్యక్తి అరెస్ట్ రూ.85 లక్షల నగదు,4 తులాల బంగారం వసూలు..నకిలీ నియామక ఉత్తర్వులతో బురిడీ

కాజీపేట: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి నిరుద్యోగ యువత నుంచి భారీగా నగదు,బంగారం,అసలు విద్యా సర్టిఫికెట్లు వసూలు చేసిన వ్యక్తిని కాజీపేట పోలీసులు అరెస్ట్ చేశారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన మెట్టు ప్రవీణ్‌కుమార్(41)ను నిందితుడిగా గుర్తించారు.ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ శాఖలో ట్యాక్స్‌ అసిస్టెంట్,ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ వంటి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అభ్యర్థులను నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.స్పోర్ట్స్‌ కోటా,ఎన్‌సీసీ కోటా,బ్యాక్‌డోర్‌ రిక్రూట్‌మెంట్‌ పేరుతో అభ్యర్థులను ఆకర్షించిన నిందితుడు..గతంలో జారీ చేసిన నియామక ఉత్తర్వుల్లో పేర్లు మార్చి నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు,మెమోరాండాలు తయారు చేసి చూపించినట్లు వెల్లడించారు.మోసం నమ్మదగినదిగా కనిపించేలా మెడికల్‌ టెస్టులు,పోలీస్‌ వెరిఫికేషన్‌ వంటి ప్రక్రియలు నిర్వహించినట్లు నటించడంతో పాటు..ఐసీఏఐలో నిర్వహించే ఓరియంటేషన్,ఐటీ కోర్సులను ప్రభుత్వ...