దళిత–బహుజనులను మోసం చేసిన కాంగ్రెస్, BRS, BJPలకు ప్రజలే బుద్ధి చెప్పాలి భువనగిరి పార్లమెంట్ BSP ఇంచార్జ్ కత్తుల కాన్షీరామ్

భువనగిరి: దళిత–బహుజనుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం కాంగ్రెస్, BRS, BJP పార్టీలకు అలవాటుగా మారిందని BSP భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్ కత్తుల కాన్షీరామ్ తీవ్రంగా విమర్శించారు. దళితులకు అన్యాయం జరిగిందని ఒక పార్టీ మరొక పార్టీపై విమర్శలు చేయడం సులభమని, కానీ దళిత–బహుజనులకు నిజమైన రాజకీయ అధికారం, సామాజిక న్యాయం కల్పించేందుకు ఈ మూడు పార్టీలు ఏం చేశాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. BRS పాలనలో దళిత ముఖ్యమంత్రి హామీ నుంచి దళిత బంధు వరకు అనేక హామీలు ఇచ్చి, వాటి అమలులో దళిత–బహుజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దళిత–బహుజనులకు...