మహిళల భద్రత మరియు టీ -సేఫ్ అప్ గురించి హన్మకొండ లోని JSM స్కూల్ షీ టీం ఎస్సై రామారావు గారి అవగాహన సదస్సు.

నేరాలు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేటి కాలంలో నేరాల అదుపులో అందరు భాగస్వామ్యం కావాలని తమవంతు బాధ్యతలను నిర్వర్తించాలని, జాగ్రత్తతో మెలగడం వల్ల మహిళల మీద జరిగే నేరాలను అదుపు చేయవచ్చని వరంగల్ షీ టీమ్ ఎస్సై రామారావు గారు అన్నారు. హన్మకొండ లోనీ JSM స్కూల్లో దాదాపు 200మంది విద్యార్థినిలతో సైబర్ నేరాలు, మహిళలపై జరిగే అత్యాచారాలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఈ సందర్భంగా వరంగల్ షీ టీమ్ ఎస్సై రామారావు గారు మాట్లాడుతూ అమ్మాయిలు ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, స్నాప్ చాట్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు, వివరాలు పంచుకోవడంలో జాగ్రత్త...