బాధ్యతాయుత పాత్రికేయతతో సమాజానికి మేలు* *మౌలానా మాసూమ్ సాఖిబ్ ఖాస్మీతో ‘అప్నా వరంగల్ డాట్ కామ్’ఎడిటర్ ప్రత్యేక భేటీ
ప్రముఖ ఇస్లామిక్ పండితుడు,ముఫ్తీ సయ్యద్ మాసూమ్ సాఖిబ్ ఖాస్మీ దామత్ బరకాతుహుమ్‌ను‘అప్నా వరంగల్ డాట్ కామ్’ఎడిటర్ మిర్జా ఫతేహుల్లా బేగ్ రియాజ్ బుధవారం ప్రత్యేకంగా కలిశారు.మౌలానా వరంగల్ పర్యటన సందర్భంగా జరిగిన ఈ భేటీలో దైవిక,మత,సామాజిక సేవలతో పాటు పాత్రికేయ రంగానికి సంబంధించిన పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు.ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆన్‌లైన్,సోషల్ మీడియా ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో మీడియా సంస్థల బాధ్యత మరింత పెరిగిందని రియాజ్ బేగ్ పేర్కొన్నారు.వార్తల ప్రచురణలో వాస్తవ నిర్ధారణ,నిజాయితీ,నిష్పక్షపాత వైఖరికి ప్రాధాన్యత ఇస్తూ సమాజంలో ఐక్యత,సోదరభావం,సానుకూల ఆలోచనలను పెంపొందించేలా పాత్రికేయత కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.‘అప్నా వరంగల్ డాట్ కామ్’ద్వారా వరంగల్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా దైవిక,మత,విద్యా,సామాజిక,సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తున్నట్లు ఆయన...