కాళోజీ జయంతి వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన చెరకు సుధాకర్ గౌడ్
కాళోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాళోజి నారాయణరావు గారి 112 వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు,ప్రముఖ వైద్యులు, రాజకీయ నాయకులు డాక్టర్ చెరకు సుధాకర్ గౌడ్ హాజరై కాళోజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు గారు నిరంతర ఉద్యమ జీవి అని, సమస్త ఉద్యమాలతో వారు సహవాసం చేశారని, కాలంబు రాగానే కాటేసి తీరాలే లాంటి ఎన్నో కవితల ద్వారా పాలకుల్ని ప్రశ్నించి,ఎదిరించి సమాజం కోసమే బతికిన కాళోజీ ఉద్యమాలే శ్వాసగా బ్రతికి తెలంగాణ యాసను భాషను సంస్కృతులను ఎలిగెత్తి చాటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాళోజీ ఫౌండేషన్ ఫౌండర్...