వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలి - రజక సంఘం నాయకులు

గీసుకొండ మండలం: ఎలుకుర్తి హవేలీ గ్రామంలోని దత్తాత్రేయ మడేలేశ్వర స్వామి రజక సంఘం ఆధ్వర్యంలో నేడు వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ 41 వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.అనంతరం వారి చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పిస్తూ, భూమికోసం, భుక్తి కోసం విముక్తి కోసం పోరాడిన వీరవనిత అంటూ వారి ఆశయాలను కొనసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ మల్లేశం, రాజు,అభిషేక్,తిరుపతి, మహేష్, సందీప్ పాల్గొన్నారు.