వర్ధన్నపేట అంబేద్కర్ సెంటర్ లో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు దళిత వ్యతిరేక వైఖరిపై భారీ రాస్తారోకో లో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు అయూబ్
BRS, BJP పార్టీల దళిత వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ మండల, టౌన్ కాంగ్రెస్ పార్టీ, దళిత సంఘాల ఆధ్వర్యంలో గురువారం వర్ధన్నపేట పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్ వద్ద వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై భారీ రాస్తారోకో నిర్వహించారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మహమ్మద్ అయూబ్ గారి నాయకత్వంలో జరిగిన ఈ నిరసనలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, దళిత సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సందర్భంగా BRS, BJP పార్టీలు దళితుల పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని, అహంకార ధోరణిని ప్రదర్శిస్తున్నాయని నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు. సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మహమ్మద్ అయూబ్ గారు మాట్లాడుతూ.తెలంగాణ శాసనసభ స్పీకర్ శ్రీ...