రాజ్యాంగ పదవుల గౌరవాన్ని దిగజార్చే వ్యాఖ్యలు సహించేది లేదు - సంఘీ ఎలేందర్ దళిత హక్కుల పోరాట సమితి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి
ఈరోజు తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి (DHPS) వరంగల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో అండర్ బ్రిడ్జి జీవుల అడ్డా వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా DHPS వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘీ ఎలేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితున్నే ముఖ్యమంత్రి నీ చేస్తాను అని చెప్పిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు.తాజాగా కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద దళితులు తమ సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తే, పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయడం ఎనకటి కాలంలో దళితులు నడిచిన భూమిలో అగ్రవర్ణ నాయకులు నడవాలంటే దళితులకు మూతికి ముంత...