విద్యుత్ ప్రమాదంలో చిన్నారి జీవితం అతలాకుతలం చికిత్సకు దాతలే దిక్కు

వరంగల్: విద్యుత్ ప్రమాదంలో 11 ఏళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిన్నారి చికిత్సకు భారీగా ఖర్చు అవుతుండటంతో కుటుంబ సభ్యులు దాతల ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 4న వరంగల్‌లో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి కుమారుడు అభికరుణ్ (11) ఇంటిపై ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ తీగలు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ఉన్న యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి అక్కడ చికిత్స పొందుతున్నాడు. చిన్నారి పరిస్థితి దృష్ట్యా మరో 2 నుంచి 3 నెలల పాటు చికిత్స అవసరమని, ఇందుకు సుమారు రూ.25 నుంచి...