యూరియా యాప్‌తో రైతులకు ఇక్కట్లు! పాత యాప్‌తో సులభంగా యూరియా... కొత్త యాప్‌తో చుక్కలు | షాపుల్లో నిల్వ ఉన్నా రైతులకు అందని ద్రాక్ష

జన చరిత్ర న్యూస్ పర్వతగిరి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా బుకింగ్, స్టాక్ వివరాలు, స్లాట్ బుకింగ్ వంటి ప్రక్రియలను డిజిటల్ విధానంలో నిర్వహించాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో రైతులకు మాత్రం కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారికంగా ఈ యాప్ ద్వారా యూరియా లభ్యతను తెలుసుకుని, అవసరమైన పరిమాణాన్ని బుక్ చేసుకునే విధానం అమల్లో ఉంది. గతంలో ఉన్న యాప్ ద్వారా రైతులు సులభంగా యూరియా బస్తాలు పొందేవారని, ప్రస్తుతం కొత్త యాప్‌లో బుకింగ్, స్లాట్, వివరాల నమోదు తదితర ప్రక్రియలు క్లిష్టంగా మారడంతో...