మేడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజా రెడ్
వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజా రెడ్డి గారు మేడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ప్రజలకు అందుతున్న వైద్య ఆరోగ్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డా.బి.జ్యోతి మరియు సిబ్బందితో మాట్లాడి, రికార్డులు, రిపోర్టులను పరిశీలించారు. అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించే విధంగా పనితీరును మెరుగుపరచాలని సిబ్బందికి సూచించారు. అనంతరం టీకాల నిల్వవుంచే ఐ ఎల్ ఆర్, డీప్ ఫ్రిజెర్ లను పరిశీలించి కోల్డ్ చైన్ వ్యవస్థను తనిఖీ చేశారు. ఫార్మసీ, మందుల లభ్యత, వార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇన్‌పేషెంట్లతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు....