నకిలీ బంగారం తాకట్టు పత్రాలతో మోసం ఇద్దరు నిందితుల అరెస్ట్ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్

నకిలీ బంగారం తాకట్టు పత్రాన్ని సృష్టించి, వాస్తవంగా బంగారం తాకట్టు లేకపోయినా ఉన్నట్లు నమ్మించి గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.59.30 లక్షలు మోసం చేసిన కేసులో ఇద్దరు నిందితులను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఎలిమి సంతోష్ (37), శ్రిమాన్ కో-ఆపరేటివ్ క్రెడిట్ యూనియన్ చైర్మన్ మరియు సీఈఓ, వడ్డేపల్లి రంజిత్ (39), వ్యాపారి ఉన్నారు. పోలీసుల విచారణలో, ఇద్దరూ కలిసి కుట్ర పన్ని రంజిత్‌కు చెందిన సుమారు 640 గ్రాముల బంగారం, శ్రిమాన్ కో-ఆపరేటివ్ క్రెడిట్ యూనియన్‌లో తాకట్టు ఉన్నట్లు చూపిస్తూ నకిలీ ప్లెడ్జ్ రసీదు తయారు చేసినట్లు వెల్లడైంది. ఆ నకిలీ పత్రాన్ని నిజమైనదిగా నమ్మించిన నిందితులు, బంగారాన్ని...