అనుమతులు లేకుండా నిల్వ చేసిన టపాసులు స్వాధీనం
హసన్‌పర్తి: అనుమతులు లేకుండా భారీగా టపాసులను నిల్వ చేసిన వ్యక్తిని వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్కూరి కిషోర్ (52) ఇంటితో పాటు ఆయన జనరల్ స్టోర్‌పై దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇంట్లో నిల్వ ఉంచిన వివిధ రకాల టపాసులు, అలాగే దుకాణంలో నిల్వ చేసిన క్రాకర్స్‌ను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో లభించిన టపాసుల విలువ రూ.2,21,130, దుకాణంలో లభించిన టపాసుల విలువ రూ.2,07,115గా పోలీసులు తెలిపారు. మొత్తంగా రూ.4,28,245 విలువైన టపాసులను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. ఎలాంటి అనుమతులు లేకుండా టపాసులను నిల్వ...