నిరుపేద ఆర్యవైశ్యుల భూమిని కాపాడాలి సీఎం రేవంత్‌రెడ్డికి ఆర్యవైశ్యుల విజ్ఞప్తి

తెలంగాణలోని నిరుపేద ఆర్యవైశ్యుల సంక్షేమం, అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ఉప్పల్ భగాయత్‌లో కేటాయించిన సుమారు రూ.200 కోట్ల విలువైన ఐదు ఎకరాల భూమిని కాపాడాలని ఆర్యవైశ్యుల ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ.. నిరుపేద ఆర్యవైశ్యుల విద్య, వైద్యం, వసతి తదితర అవసరాలకు ఉపయోగపడేలా కేటాయించిన ఈ భూమిని కొందరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నిరుపేద ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం కోలేటి దామోదర్, బిగాల గణేశ్ గుప్తా తదితరులు చేసిన కృషితో ప్రభుత్వం భూమిని కేటాయించిందని, అయితే ప్రస్తుతం ఆ భూమి అసలు లక్ష్యానికి భిన్నంగా...