పీడీఎస్ బియ్యం అక్రమ సేకరణ, తరలింపుపై ఒకరి అరెస్ట్

వరంగల్‌లో పీడీఎస్ బియ్యం అక్రమంగా సేకరించి తరలిస్తున్న వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనుమానిత ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో గోవిందుల గణేష్ (30) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి సుమారు 35 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, బ్రోకెన్ రైస్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.1,22,500గా పోలీసులు తెలిపారు. అలాగే బియ్యం బస్తాలు కుట్టే క్లోజర్ మెషిన్ ఒకటి, వెయింగ్ మెషిన్ ఒకటి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం వస్తువుల విలువ సుమారు రూ.1,27,500గా అంచనా వేశారు. అరెస్టైన వ్యక్తిని...