పర్యావరణహిత గణపతి విగ్రహాల తయారీ
గీసుకొండ మండలం, ఎలుకుర్తి హవేలి: పర్యావరణ పరిరక్షణలో భాగంగా చేపట్టిన ‘ఎకో లైఫ్ మిషన్’ కార్యక్రమంలో భాగంగా గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పర్యావరణహిత గణపతి విగ్రహాల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్.పి. రంగనాథ్ నేతృత్వం వహించారు. విద్యార్థులు సహజసిద్ధమైన పదార్థాలతో గణపతి విగ్రహాలను తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై అవగాహన పెంపొందించుకున్నారు. పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను వినియోగించాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కిరణ్మయి, శ్రీనివాస్, కిషోర్, సురేష్, కిషన్,...