విద్యార్థుల పోరాటానికి అండగా ఉంటాం వరంగల్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ పర్యటన

వరంగల్‌: వరంగల్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో జీఓ నంబర్‌ 97 అమలు చేయకూడదని,కళాశాలను పీపీపీ(పబ్లిక్‌–ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌)విధానంలోకి తీసుకెళ్లవద్దని,విద్యార్థులను కార్మికులుగా పరిగణించకూడదని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు చేపడుతున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా విద్యార్థులు నిరసనలు,నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు.విద్యార్థుల నిరాహార దీక్ష శిబిరాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వరంగల్‌ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ గురువారం సందర్శించారు.దీక్ష చేస్తున్న విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.విద్యార్థుల డిమాండ్లకు తన మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా నరేందర్‌ మాట్లాడుతూ..విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎప్పుడైనా వారికి అందుబాటులో ఉంటానని తెలిపారు.విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.విద్యార్థుల భవిష్యత్తును కాపాడే వరకు...