పొలాల్లోకి దిగిన వరంగల్ కలెక్టర్.. రీ-సర్వేపై సీరియస్ వ్యవసాయ భూములపై ప్రత్యక్ష పరిశీలన
“ఎలాంటి తప్పులకు తావులేదు..* *పకడ్బందీగా నిర్వహించాలి” – అధికారులకు కలెక్టర్ ఆదేశాలు* జన చరిత్ర న్యూస్ పర్వతగిరి *పర్వతగిరి:* భూముల రీ-సర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్యశారద అధికారులను ఆదేశించారు. పర్వతగిరి మండలం జమాల్‌పురం గ్రామంలోని వ్యవసాయ భూముల్లోకి స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లిన కలెక్టర్, అక్కడ జరుగుతున్న రీ-సర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. సర్వే పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి.. భూముల హద్దులు, కొలతలు, రికార్డుల వివరాలు ఎలా నమోదు చేస్తున్నారు అనే అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు కలెక్టర్ పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. భూముల రీ-సర్వేలో చిన్నపాటి...