జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలి 18, 19 తేదీల్లో కలెక్టరేట్ ఎదుట TUWJ-IJU రిలే నిరాహార దీక్షలు
నల్గొండ: జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని TUWJ-IJU నాయకులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 18, 19 తేదీల్లో కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. రిలే నిరాహార దీక్షలకు అనుమతి కోరుతూ TUWJ-IJU జిల్లా నాయకులు డీఎస్పీ కె. శివరాంరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమం, వారి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ముఖ్యంగా జర్నలిస్టులకు ఇంటి స్థలాల కేటాయింపు సమస్యను తక్షణమే పరిష్కరించాలని...