*కాంగ్రెస్ దుశ్చర్యలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు* *అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులపై పోలీసుల దౌర్జన్యం ఎంపీ రవిచంద్ర* *తెలంగాణ న్యూఢిల్లీ సెప్టెంబర్ 11* తెలంగాణలో ప్రజలకే కాకుండా ప్రజాప్రతినిధులకు కూడా రక్షణ లేకుండా పోయిందని బీఆర్‌ఎస్ పార్లమెం

కాంగ్రెస్ దుశ్చర్యలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదుఅసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులపై పోలీసుల దౌర్జన్యం ఎంపీ రవిచంద్ర *తెలంగాణ న్యూఢిల్లీ సెప్టెంబర్ 11* తెలంగాణలో ప్రజలకే కాకుండా ప్రజాప్రతినిధులకు కూడా రక్షణ లేకుండా పోయిందని బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత,ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకే బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులపై దాడులు,నిర్బంధాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.ఢిల్లీ తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఎమ్మెల్యేలు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి,పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి రవిచంద్ర విలేకరులతో మాట్లాడారు.అంతకుముందు బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్,మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతిని...